బంపర్ ఆఫర్ కొట్టేసిన నిఖిల్ బ్యూటీ

Tue,January 17, 2017 12:29 PM
nandita swetha gets crazy offer

యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో కథానాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ నందిత శ్వేత. ఈ అమ్మడికి ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్. అరవింద్ స్వామి, రితికా సింగ్ ప్రధాన పాత్రలలో సెల్వ తెరకెక్కించనున్న మూవీలో నందితని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా ఇవ్వనున్నారట. పవర్ ప్యాక్డ్ గా నందిత రోల్ ఉంటుందని తెలుస్తోండగా, ఈ మూవీతో తనకి మరిన్ని ఆఫర్లు వస్తాయని ఈ అమ్మడు భావిస్తోంది. సెల్వ తెరకెక్కించిన నేంజం మరపతిల్లై సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుండగా ఆ తర్వాత అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మూవీని పట్టాలెక్కించనున్నాడు. నేంజం మరపతిల్లై చిత్రం ఎస్ జె సూర్య, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో రూపొందిన సంగతి తెలిసిందే.

2258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles