ప్రేమ క‌థా చిత్రం సీక్వెల్ ఫ‌స్ట్ లుక్ ఔట్‌

Thu,October 18, 2018 07:53 AM
Nandita Swetha first look out

హ‌ర‌ర్ అండ్ ల‌వ్ కాన్సెప్ట్ ఆధారంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్. 2003 మే 11న విడుద‌లైన ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ క‌థా చిత్రం2 రూపొందుతుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నందిత శ్వేత భ‌య‌పెట్టించేలా క‌నిపిస్తుంది. ఈ నెల 22 నుండి రెండు పాటలు, పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. నవంబర్‌ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’ అని నిర్మాత‌లు తెలిపారు. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి ప‌ని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు.

2415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles