2014,2015,2016 నంది అవార్డులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

Tue,November 14, 2017 05:22 PM
nandi awards list announced

సినీ రంగంలో అత్యుత్త‌మ‌ ప్రతిభ కనబరిచిన వారికి నంది అవార్డులను ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఈ ప్ర‌క్రియ‌కి కొంత గ్యాప్ రాగా, ఈ ఏడాది మార్చిలో ఏపి ప్రభుత్వం 2012,2013 సంవత్సరాలకి గాను నంది అవార్డులను ప్రకటించింది. కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ 2012 అవార్డుల జాబితాను ప్రకటించగా, 2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

2014 సంవ‌త్స‌రానికి గాను నంది అవార్డు గెలుచుకున్న విజేత‌ల వివ‌రాలు

ఉత్తమ చిత్రం - లెజెండ్‌
ఉత్తమ నటుడు - బాలకృష్ణ(లెజెండ్‌)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - లౌక్యం
ఉత్తమ ప్రతినాయకుడు - జగపతిబాబు(లెజెండ్‌)
ఉత్తమ సహాయ నటుడు - నాగచైతన్య(మనం)
ద్వితీయ ఉత్తమ చిత్రం - మనం

2015 సంవ‌త్స‌రానికి గాను నంది అవార్డు గెలుచుకున్న విజేత‌ల వివ‌రాలు

ఉత్తమ చిత్రం - బాహుబలి(బిగినింగ్‌)
ఉత్తమ నటుడు - మహేష్‌బాబు( శ్రీమంతుడు)
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు
బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

2016 సంవ‌త్స‌రానికి గాను నంది అవార్డు గెలుచుకున్న విజేత‌ల వివ‌రాలు

ఉత్తమ చిత్రం - పెళ్లిచూపులు
ఉత్తమ నటుడు - జూనియర్‌ ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - రజనీకాంత్‌
బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌


2014,2015,2016 రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డులు


2014 నంది అవార్డుల లిస్టు

2015 నంది అవార్డుల లిస్టు

2016 నంది అవార్డుల లిస్టు

3715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS