ఒకే వేదిక‌పై ముగ్గురు హీరోలు.. ఆనందంలో అభిమానులు

Sun,October 21, 2018 07:37 AM
nandamuri heroes on same stage

నంద‌మూరి అభిమానుల క‌ల నెర‌వేరే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌లని ఒకే వేదిక‌పై చూడాల‌ని అభిమానులు ఎన్నాళ్ళ‌నుండో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో నేడు జ‌ర‌గ‌నున్న అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్‌లో అభిమానుల కోరిక తీర్చ‌నున్నారు ఈ ముగ్గురు హీరోలు. శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగే విజ‌యోత్స‌వ స‌భ‌కి బాల‌య్య‌,క‌ళ్యాణ్ రామ్‌లు ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నార‌ని తెలుస్తుండ‌గా, చాలా ఏళ్ళ త‌ర్వాత వీరి ముగ్గురిని ఒకే వేదిక‌పై చూడ‌నున్నాం. గ‌తంలో బాల‌య్య న‌టించిన సింహా సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ సంద‌డి చేయ‌గా, మ‌ళ్ళీ వీరు క‌ల‌వ‌నే లేదు. ఇప్పుడు అబ్బాయి సినిమా ప్ర‌మోష‌న్ కోసం బాబాయ్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు. ఇదిలా ఉంటే బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో క‌ల్యాణ్ రామ్ హరికృష్ణ పాత్ర పోషిస్తుండ‌గా, ఎన్టీఆర్‌తో కూడా ముఖ్య పాత్ర చేయించాల‌ని వారు అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ వార్తే క‌నుక నిజ‌మైతే అభిమానుల ఆనందం ఎల్ల‌లు దాట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

4817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS