భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కూతురు అఖిల ప్రియ వివాహం నేడు ఆళ్ళగడ్డలో ఘనంగా జరిగింది. అఖిల ప్రియ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు కేబినేట్ మంత్రులు హాజరు కావలసి ఉంది. కాని మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో అఖిల ప్రియ పెళ్లిలో కళ తప్పిందని అంటున్నారు. ఆళ్ళగడ్డలో ఈ రోజు తెలుగు దేశం పార్టీ సభ్యులు సందడి చేయాల్సి ఉన్న సమయంలో హరికృష్ణ మరణం వాళ్లందరినీ విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రత్యేక హెలీకాప్టర్‌లో హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే . రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనుండగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరపనున్నట్టు సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ఆదేశించారు.