మ‌నం స్టైల్‌లో నంద‌మూరి ఫ్యామిలీ సినిమా..!

Tue,February 20, 2018 11:38 AM
మ‌నం స్టైల్‌లో నంద‌మూరి ఫ్యామిలీ సినిమా..!

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ ముఖ్య‌ పాత్ర‌ల‌లో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం మ‌నం. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎన్నో జ్ఞాప‌కాల‌ని మిగిల్చింది. మెమోర‌బుల్ మూవీగా ఈ చిత్రాన్ని ఇప్ప‌టికి గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ స‌భ్యులు. ఇప్పుడు ఇదే స్టైల్‌లో నంద‌మూరి ఫ్యామిలీ కుటుంబ చిత్రం కూడా తెర‌కెక్క‌నుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడ‌ట‌. ఇందులో కథా పరంగా .. నిడివి తక్కువగా గల రెండు ముఖ్యమైన పాత్రలు అవసరం కావడంతో, హరికృష్ణ .. ఎన్టీఆర్ లతో ఆ పాత్రలను చేయించాలనే ఆలోచనలో క‌ళ్యాణ్ రామ్ ఉన్నారని సమాచారం. ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం ఎమ్మేల్యే, నా నువ్వే అనే చిత్రాల‌తో బిజీగా ఉన్న క‌ళ్యాణ్ రామ్ ఇవి పూర్తైన వెంట‌నే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడట‌. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

1431

More News

VIRAL NEWS