జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న బాల‌య్య‌

Sun,June 10, 2018 12:31 PM

హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బాలయ్య నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ.. అభిమానులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే క్రమశిక్షణతోనే సాధ్యం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అభిమానుల కోలాహలంతో ఆస్ప‌త్రి ప‌రిస‌రాలు సంద‌డిగా మారింది.

2727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles