వ‌ర‌ద బాధితుల‌కి ఇళ్ళు క‌ట్టిస్తున్న ప్ర‌ముఖ న‌టుడు

Sat,August 17, 2019 09:47 AM
Nana Patekar To Build Houses For The Flood Victims

ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై త‌నుశ్రీ ద‌త్తా లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కొన్నాళ్ళుగా ఆయ‌న వార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయ‌న మంచి ప‌నితో వార్త‌ల‌లోకి ఎక్కారు. కొల్హాపూర్‌లోని షిరోల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల వ‌ల‌న తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రైతే వ‌ర‌ద‌లలో త‌మ ఇళ్ళు కొట్టుకుపోవ‌డంతో నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన నానా ప‌టేక‌ర్ వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్ళు క‌ట్టించేందుకు సిద్ధం అయ్యారు. నేను షిరోల్‌కు వచ్చినప్పుడు, అక్క‌డి పరిస్థితిని చూశాను, అందుకే మేము 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాము. తక్లేవాడిలోని 3 వేల ఇళ్ల పరిస్థితిని సమీక్షించబోతున్నాం. ప్రభుత్వానికి కూడా దాని పరిమితులు ఉన్నాయి. అందువల్ల, మనమందరం వరద ప్రభావిత పౌరులకు పునరావాసం కల్పించడానికి ప్రయత్నించాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles