విరాట‌ప‌ర్వంలో నెగెటివ్ రోల్ చేయ‌బోతున్న‌ట్టు బాలీవుడ్ స్టార్స్

Fri,May 3, 2019 12:25 PM

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న పీరియ‌డ్ డ్రామా విరాట‌ప‌ర్వం 1992. నీది నాది ఒకే కథతో విమర్శకుల మెప్పు పొందిన వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక టబు, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. ఇంత‌వ‌ర‌కు త‌ను ఆ పాత్ర‌లో క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు. జూలైలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

1964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles