నానాపటేకర్ నన్ను వేధించాడు..

Wed,September 26, 2018 10:01 AM
Nana Patekar harassed me, alleges Tanushree Dutta

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్త .. లైంగిక వేధింపుల గురించి ఓ సంచలన కామెంట్ చేసింది. పదేళ్ల క్రితం జరిగిన ఆ ఘటన గురించి ఆమె గుర్తు చేసింది. అయితే ఆ విషయం మంగళవారం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. 2009లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో తనను ఓ నటుడు వేధించాడని ఆమె చెప్పింది. అయితే ఆ నటుడు ఫేమస్ హీరో నానాపటేకర్ అని తేలింది. జూమ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళల పట్ల నానాపటేకర్ ప్రవర్తన సరిగా ఉండదన్న విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని ఆమె చెప్పింది. మహిళలతో నానాపటేకర్ అసభ్యంగా, చాలా హేయంగా ప్రవర్తిస్తాడని, కానీ ఎవరు కూడా ఈ అంశాన్ని ఇంతవరకు లేవనెత్తలేదని తనూశ్రీ పేర్కొన్నది. అక్షయ్ కుమార్, రజనీకాంత్ లాంటి హీరోలతోనూ నానాపటేకర్ నటిస్తున్నారని, అలాంటి పెద్ద హీరోలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరింది. ఆషిక్ బనాయా అప్నా సినిమాలోనూ తనూశ్రీ నటించింది.

3336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles