లైంగిక వేధింపులు.. నానాప‌టేక‌ర్ ప్రెస్ మీట్ ర‌ద్దు

Mon,October 8, 2018 03:14 PM
Nana Patekar cancels press meet on Tanushree Duttas sexual harassment allegation

ముంబై: బాలీవుడ్ హీరో నానా పటేకర్ ఇవాళ నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. తనను నానాపటేకర్ వేధింపులకు గురి చేశాడని హీరోయిన్ తనుశ్రీ దత్త ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న నానాపటేర్.. వాస్తవానికి ఇవాళ ఆ విషయాన్ని మీడియా సమావేశం ద్వారా వెల్లడించాలని నిర్ణయించారు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసినట్లు నానాపటేకర్ కుమారుడు ఓ మెసజ్ ద్వారా తెలియజేశాడు. 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో.. నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మీటూ ఉద్యమం ప్రచారం హోరెత్తిన నేపథ్యంలో.. అత్యాచారా వేధింపులకు గురైన మహిళలు తమ గళం విప్పుతున్నారు. అయితే పదేళ్ల క్రితమే ఆ ఘటన గురించి మీడియాకు వివరించినట్లు కూడా నానాపటేకర్ ఇటీవల తెలిపారు.

1553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles