నమ్రతా త్రోబ్యాక్ పిక్.. ఇప్పటిది కాదు 1990లో తీసినప్పటిది!

Mon,April 15, 2019 03:27 PM
 Namrata Shirodkar Throwback Pic will give you 90s Vibes

ఇది సోషల్ మీడియా యుగం. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఎవరైనా టెక్నాలజీకి దాసోహం అనాల్సిందే. ఈమధ్య సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. త్రోబ్యాక్ పిక్ పేరుతో నడుస్తున్న ఆ ట్రెండ్ ప్రకారం ఏం చేయాలంటే ఎవరిదైనా వాళ్లకు సంబంధించిన స్పెషల్ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అని క్యాప్షన్ ఇవ్వాలి. కాకపోతే ఆ పిక్‌లో సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలి. ఈ మధ్య వారంలో ఉన్న ఏడు రోజులకు ఏడు త్రోబ్యాక్ పిక్స్‌ను కూడా విడుదల చేస్తున్నారు సెలబ్రిటీలు.

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ సోమవారం త్రోబ్యాక్ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. తన ఫ్రెండ్ స్వెట్లానా క్యాస్పర్‌తో కలిసి దిగిన ఫోటో అది. 1990ల్లో దిగిన ఫోటో అది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేయడంతో అప్పటి నమత్రాను చూసిన నెటిజన్లు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు అప్పట్లో నమత్ర న‌టించిన‌ సినిమాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.

2523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles