మ‌హేష్ మంచి మ‌న‌సుకు అభిమానులు ఫిదా

Tue,June 18, 2019 08:25 AM
Namrata Shirodkar shared intresting post about mahesh

సూప‌ర్ స్టార్ మ‌హేష్ రీల్ హీరోనే కాదు రియ‌ల్ హీరో కూడా అనిపించుకుంటున్నాడు. ప‌లు గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకొని అభివృద్ది చేస్తున్న ఈ శ్రీమంతుడు చిన్నారులకి హృద‌య సంబంధిత శ‌స్త్ర చికిత్స‌లు చేయిస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. గ‌త‌ మూడున్న‌ర ఏళ్ళ‌లో మ‌హేష్ ఆంధ్రా హ‌స్పిట‌ల్స్‌, యు.కె కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేష‌న్‌ల‌తో క‌లిసి వెయ్యి మంది చిన్న పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్స్ విజ‌యవంతం కావ‌డంలో భాగం అయ్యారు. మ‌హేష్ భార్య నమ్ర‌త ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ.. ఓ మంచి పని కోసం తమకు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. మహేశ్‌తో కలిసి ఆంధ్రా హాస్పిటల్స్ .. వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వ‌హించింది. 2018 డిసెంబర్ నాటికి 150 మంది చిన్నారులకు గుండె సంబంధిత చికిత్సలు జరిపించామని గతంలో నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మ‌హేష్ దంప‌తులు చేస్తున్న ఈ మంచి ప‌నికి ప‌లువురి నుండి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. మ‌హేష్ త్వ‌ర‌లో అనీల్ రావిపూడితో క‌లిసి త‌న 26వ సినిమా చేయ‌నున్న సంగతి తెలిసిందే.

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles