సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో

Thu,October 24, 2019 10:02 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీ అంతా ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌డం ఇంత‌వ‌ర‌కు జర‌గ‌లేదు. కాని ప్ర‌ముఖ యాడ్ కోసం మ‌హేష్ బాబుతో పాటు న‌మ్ర‌తా శిరోద్క‌ర్, గౌత‌మ్, సితార స్క్రీన్ షేర్ చేసుకున్నారు. య‌మున కిషోర్ డైరెక్ష‌న్‌లో ఈ యాడ్ రూపొంద‌గా, కొద్ది సేప‌టి క్రితం ముప్పై సెక‌న్ల వీడియోని విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేష్ ఫ్యామిలీ త‌ప్ప మ‌రో వ్య‌క్తి క‌నిపించ‌లేదు. చూడ ముచ్చ‌ట‌గా ఉన్న ఈ వీడియోని చూసి మ‌హేష్ అభిమానులు తెగ మురిసి పోతున్నారు. మ‌హేష్ భార్య న‌మ్ర‌త ఇప్ప‌టికే క‌థానాయిక‌గా అల‌రించ‌గా, గౌత‌మ్ 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యాడు. ఇక సితార సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ‌స్ అయిన సంగతి తెలిసిందే. కాగా, మ‌హేష్ ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నుండ‌గా, ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది.


7006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles