మ‌హేష్ భార్య‌పై మలైకా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Fri,February 23, 2018 01:00 PM
మ‌హేష్ భార్య‌పై మలైకా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ హీరోయిన్ మ‌లైకా అరోరా ‘వోగ్ బీఎఫ్‌ఎఫ్‌’ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. షోలో నేహ ధూపియా అడిగిన ప్రశ్న‌ల‌కు షాకింగ్ స‌మాధానాలు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చారు. మోడ‌లింగ్ నుండి సినిమా రంగానికి వ‌చ్చిన మ‌లైకా తాను మోడ‌లింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌ప్పుడు సీనియ‌ర్స్ నుండి వేధింపులు ఎదుర్కొన్న‌ట్టు తెలియ‌జేశారు. మోడ‌లింగ్ పరిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ భార్య త‌న‌కంటే సీనియ‌ర్ అని చెప్పిన మ‌లైకా, న‌మ్ర‌తా త‌న‌ప‌ట్ల‌ చాలా దురుసుగా వ్య‌వ‌హ‌రించేంద‌ని చెప్పుకొచ్చింది. మ‌రో భామ మెహర్‌ జెస్సియా కూడా త‌న‌కంటే సీనియ‌ర్ అని కొత్త‌గా వ‌చ్చిన వారితో పొగ‌రుగా ప్ర‌వ‌ర్తిస్తూ సీనియారిటీ ప్ర‌ద‌ర్శించేవార‌ని మ‌లైకా అరోర్ ఖాన్ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ఇప్పుడు మాత్రం వారిద్ద‌రు త‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగానే ఉంటున్నారని మ‌లైకా స్ప‌ష్టం చేసింది. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్ నుండి విడిపోయిన త‌ర్వాత మలైకా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తుంది.

2891

More News

VIRAL NEWS