వైర‌ల్ వీడియోపై న‌మ్ర‌త షాకింగ్ కామెంట్స్

Wed,December 12, 2018 11:57 AM
Namrata Shirodkar fires on zomato

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే న‌మ్ర‌త శిరోద్క‌ర్ ప‌లు విష‌యాల‌పై త‌న దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. కొద్ది రోజులుగా జొమాటోకి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ఎంత‌గా వైర‌ల్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌ముఖ ఆన్‌లైన్‌ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌కి చెందిన బాయ్‌.. క‌స్ట‌మ‌ర్ ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌ని తిని మ‌ళ్ళీ ఆ ప్యాకింగ్‌ని సీల్ చేయ‌డం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా, తాజాగా మ‌హేష్ భార్య న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రాంలో జొమాటోపై అసంత‌ప్తి వ్యక్తం చేశారు.

ప్ర‌ముఖ డెలివ‌రీ సంస్థ‌ల ప‌ని తీరు చూసి నేను షాక్ అయ్యాను. ఫుడ్ ఆర్డ‌ర్ చేసే వారు క‌నీస శుభ్ర‌త‌ని ఆశించ‌డం స‌హ‌జం. అంతేకాక వారు ఎలా డెలివ‌రీ చేస్తారని కూడా ఆలోచిస్తారు. డెలివ‌రీ బాయ్‌ల ప‌ని తీరు చూసాక ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలంటేనే భ‌య‌మేస్తుంది. ఈ సారి ఆర్డ‌ర్ చేసే ముందు క‌నీసం రెండు సార్లు ఆలోచించండి. ఇక ఇప్ప‌టి నుండి నా పిల్లలను ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయనివ్వను.. మీకూ ఇదే చెప్తున్న’ అంటూ కామెంట్‌ చేశారు. ఈ సంఘ‌ట‌న మ‌ధుర‌లో జ‌ర‌గ‌గా, ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి తొల‌గించిన సంస్థ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ, మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామని చెప్పింది. ఫుడ్ ప్యాకింగ్‌లో ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్స్‌ని తీసుకొస్తామని తెలిపింది.

2499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles