సిద్ధాపురంలోను స్కూల్ నిర్మిస్తున్న మ‌హేష్ బాబు

Thu,April 12, 2018 08:10 AM
namrata shares school building photoes

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శ్రీమంతుడు చిత్రం మ‌హేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంటే కాకుండా ప్ర‌జ‌ల‌లో సామాజిక స్ఫృహ‌ని క‌లిగించింది.ఇలాంటి అద్బుత చిత్రాన్ని త‌నకి అందించినందుకు మ‌హేష్ చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల‌కి కృత‌జ్ఞ‌త‌గా కాస్ట్‌లీ కారు బ‌హుమ‌తిగా ఇచ్చిన విష‌యం విదిత‌మే. అయితే శ్రీమంతుడు చిత్రాన్ని ఇన్సిపిరేషన్‌గా తీసుకొని ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలోని గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకున్నాడు మ‌హేష్‌. కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెంలో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన మ‌హేష్ ఇటీవ‌ల కృష్ణ తల్లి , తండ్రి ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా పేరుతో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. ఇక తాజాగా తెలంగాణ‌లోని సిద్ధాపురం గ్రామంలో స్కూల్‌, బిల్డింగులు నిర్మిస్తున్నాడు. అంతేకాదు పిల్ల‌ల కోసం బెంచెస్ ఏర్పాటు చేయిస్తున్నాడు. టాయిలెట్స్ క‌ట్టిస్తున్నాడు. కొంద‌రికి షూస్ అందిస్తున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోల‌ని మ‌హేష్ వైఫ్ న‌మ్ర‌త త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. మ‌హేష్ చేస్తున్న మంచి ప‌నులకి అభిమానులే కాదు నెటిజ‌న్స్ కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌హేష్ ,కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఏప్రిల్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయ‌డం గ్యారెంటీ అంటున్నారు.

2389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles