జాన్వీ క‌పూర్ ఆస‌నాలు చూసి నెటిజ‌న్స్ షాక్

Sun,August 18, 2019 08:31 AM
namrata purohit feets with jhanvi kapoor

దివంగ‌త న‌టి శ్రీదేవి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టంది జాన్వి. ద‌ఢ‌క్‌ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం తక్త్`, `కార్గిల్ గర్ల్`, `రూహ్ అఫ్జా` చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే జాన్వీ ఫిట్‌నెస్‌పై ఎంత ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న దైనందిన జీవితంలో వ‌ర్క‌వుట్స్‌కి కూడా కొంత స‌మ‌యం త‌ప్ప‌క కేటాయిస్తుంది. త‌న శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప‌లు ర‌కాల ఆస‌నాలు చేస్తున్న జాన్వీ.. ఈ సారి స‌రికొత్త‌గా ప్ర‌య‌త్నించింది. త‌న‌ పర్సనల్ ట్రైనర్ నమ్రత పురోహిత్, జాన్వీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ అరుదైన ఫీట్ తో కనిపించారు. ఈ వర్కవుట్ ప్రత్యేకతను రివీల్ చేశారు నమ్రత. ఈ పొజిషన్ బాడీ టోనింగ్ లో భాగంగా మజిల్స్ ని బలంగా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles