సినిమా టైటిల్ మారిస్తే సరిపోదు..

Fri,January 12, 2018 02:26 PM
సినిమా టైటిల్ మారిస్తే సరిపోదు..


ముంబై: పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా మరోసారి కర్ణిసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. కేవలం సినిమా టైటిల్‌ను పద్మావతి నుంచి పద్మావత్‌గా మారిస్తే సరిపోదని డిమాండ్ చేస్తూ..కర్ణిసేన సభ్యులు ముంబైలోని సీబీఎఫ్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీబీఎఫ్‌సీ ఆఫీస్ వద్దకు చేరుకున్న పోలీసులు, 96మంది కర్ణిసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని గందేవి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పద్మావత్ సినిమాను కొన్ని రాష్ర్టాలు మినహా అన్ని ప్రాంతాల్లో జనవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సంజయ్‌లీలా బన్సాలీ అండ్ టీం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గుజరాత్‌లో పద్మావత్ సినిమా విడుదల కాదని ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS