‘మన్మథుడు 2’ రెండో పాట చూశారా..!

Mon,July 29, 2019 06:25 PM

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని రెండో పాటను నాగార్జున ట్విటర్లో విడుదల చేశారు. ‘నా... లోనా’ అంటూ సాగే ఈ పాటకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ను సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద ఆలపించారు. సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ‘RX 100’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఆగస్ట్‌ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

1331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles