మీనా కూతురి బ‌ర్త్‌డేలో సెల‌బ్రిటీలు

Sun,December 17, 2017 10:29 AM
nainika birthday celebrations

ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా అల‌రించిన మీనా 2009లో విద్యాసాగ‌ర్‌ని వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కి నైనిక అనే చిన్నారి 2011లో జ‌న్మించింది. నైనిక ని తేరి చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేయించిన సంగతి తెలిసిందే. ఇళయదళపతి విజయ్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి చిత్రంలో విజయ్ కూతురిగా నైనిక నటించింది. ఈ చిత్రంలో నైనిక పాత్ర చాలా డిఫరెంట్‌గా మనస్సుకు హత్తుకు పోయేలా ఉంది. దాదాపు 40 సీన్లలో కనిపించిన ఈ చిన్నారి తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. మలయాళ చిత్రం భాస్కర్ ది రాస్కెల్ తమిళంలోకి రీమేక్ అవుతుండగా ఈ చిత్రంలో నైనిక కీలక పాత్ర పోషిస్తుంది. అరవింద్ స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఏడో ప‌డిలోకి అడుగుపెట్టిన నైనిక బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని మీనా కుటుంబ స‌భ్యులు రీసెంట్‌గా జ‌రిపారు. ఈ వేడుక‌కి రోజాతో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీఉ కూడా హాజ‌ర‌య్యారు. చాలా సందడిగా జ‌రిగిన ఈ బ‌ర్త్‌డే వేడుక‌కి సంబంధించిన వీడియోని రోజా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

3862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles