మ‌హేష్ సినిమా ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం మోదీనేన‌ట‌..!

Sat,June 30, 2018 10:37 AM
nahesh 25 movie delayed due to modi visit

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డెహ్రాడూన్లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర బృందం 2 నెల‌ల వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ జ‌రుపుకోవాల‌ని ముందే ప్లాన్ చేసుకుంద‌ట‌. కాని మోదీ కార‌ణంగా షెడ్యూల్ పూర్తిగా మారిందని అంటున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే సంద‌ర్భంగా డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని విజిట్ చేశారు మోదీ. ఆయ‌న రాక కార‌ణంగా నెల రోజుల ముందుగానే ఆ ప్రాంతాన్ని త‌మ అధీనంలోకి తీసుకున్నారు భ‌ద్రతా సిబ్బంది. అయితే ఆ ఇనిస్టిట్యూట్‌లోనే రెండు నెల‌ల పాటు షూటింగ్ జ‌ర‌పాల‌నుకున్న టీంకి నిరాశ ఎదురైంది. దాదాపు షెడ్యూల్‌లో నెల రోజులు షూటింగ్‌కి బ్రేక్ ప‌డ‌డంతో సంక్రాంతికి వ‌స్తుంద‌నుకున్న ఈ మూవీ కొంత లేట్‌గా రిలీజ్ అవుతుందని అంటున్నారు. మ‌రి దీనిపై పూర్లి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు. రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రధానంగా సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉంటుందని స‌మాచారం.

2612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles