వర్మ-నాగ్ సినిమా షురూ..వీడియో

Mon,November 20, 2017 01:12 PM
వర్మ-నాగ్ సినిమా షురూ..వీడియో


హైదరాబాద్: రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఇపుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనుంది. వర్మ డైరెక్షన్‌లో నాగ్ తీస్తున్న కొత్త చిత్రం ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. శివ సినిమా కాన్సెప్ట్‌తో చుట్టూ గొలుసుతో వేసిన సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నాగార్జున సీరియస్ లుక్‌తో ఓ చేతిలో గన్, మరో చేతిలో సగం చింపేయబడి ఉన్న 100 నోటు పట్టుకుని ఉన్న పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నాయి. ‘నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా..తక్కువ నొప్పితో చస్తావ్. చూజ్’ అంటూ నాగ్ సినిమాలోని డైలాగ్ చెబుతూ సందడి చేశాడు.
nag-varma9
nag-varmalook
varma-nagmovie1

1314
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS