చైతూ దంపతులకు నాగ్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Sun,September 24, 2017 07:37 AM
nagarjuna surprise gift to chai and sam

అక్టోబర్ లో నాగచైతన్య- సమంత పెళ్ళి బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ జంట ఒకవైపు తమ సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పెళ్ళికి షాపింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి పెళ్ళికి సంబంధించి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా సమంత- నాగచైతన్య జంటకి పెళ్ళి తర్వాత అక్కినేని నాగార్జున స్టన్నింగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో కొత్త జంటకి మంచి కాటేజ్ ని నిర్మించి వారి పెళ్లి కానుకగా ఇవ్వాలని నాగ్ భావిస్తున్నాడట. ఇందుకోసం పనులు కూడా మొదలు పెట్టాడట. ఖరీదైన మెటీరియల్ తో దీనిని తయారు చేయిస్తున్నట్టు సమాచారం. కాటేజ్ పనులకి సంబంధించిన ఫోటో అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కాటేజ్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగే టైంలో అక్కడే బస చేసేందుకు వీలుగా నిర్మిస్తున్నట్టు సమాచారం.

6232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles