కోడలు హిట్ తీసుకొచ్చిందనేలా ఉండాలి: నాగార్జున

Thu,October 12, 2017 10:43 PM
nagarjuna says about rajugaari gadhi 2 movie


హైదరాబాద్ : నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత వస్తున్న ‘రాజుగారి గది 2’ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు నాగార్జున తెలిపాడు. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అన్నాడు. పెళ్లయిన తర్వాత కోడలు సమంత ఒక హిట్ తీసుకొచ్చిందని చెప్పుకునేలా ఉండాలి.. ఆ సమయం తప్పకుండా వస్తుందని ఆకాంక్షించాడు నాగ్. డైరెకట్ర్ ఓంకార్ కు సినిమా మీద విపరీతమైన ప్రేమ. అనుకున్నది సరిగ్గా వచ్చేవరకు అందర్ని చావబాదాడు. నేను సాధారణంగా ఎప్పుడు చిరాకు పడను. కానీ ఓంకార్ మీద చికాకు పడ్డాను. షూటింగ్ పూర్తయ్యాక చివరి రోజు ఓంకార్ కు నీకో దండం అయ్యా బాబు అని చెప్పానన్నాడు నాగార్జున. రాజుగారి గది 2 చిత్రంలో సమంత లాయర్ గా కనిపించనుంది.

1922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS