క‌న్నీరు పెట్టుకున్న రాహుల్‌.. అలీకి చుర‌క‌లు అంటించిన నాగ్

Sat,October 5, 2019 10:29 PM

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం మ‌రో కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మొద‌లు కాగా, ప్ర‌స్తుతం తొమ్మిది మంది ఇంట్లో ఉన్నారు. 76 రోజుల బిగ్ బాస్ ప్ర‌యాణంలో ఎన్నో కొట్లాట‌లు, గొడ‌వ‌లు, ప్రేమ‌లు, ఆనందాలు ఉన్నాయి. బ‌య‌ట ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న వారు కూడా ఏదో ఒక సంద‌ర్భంలో క‌న్నీరు పెట్టుకున్నారు. అయితే మొద‌టి నుండి కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్న‌ రాహుల్ తాజా ఎపిసోడ్‌లో క‌న్నీరు పెట్టుకున్నారు. పునర్న‌వి మాట‌ల‌కో లేదంటే హోమ్ సిక్ వ‌ల‌నో తెలియ‌దు కాని సింగిల్‌గా కూర్చొని చాలా బాధ‌ప‌డ్డాడు. ఆయ‌న‌ని బాబా భాస్క‌ర్ ఓదార్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి రాహుల్ అదే మూడ్‌లో ఉండిపోయాడు.


అనంత‌రం బిగ్ బాస్ హౌజ్‌కి ఎవ‌రు బ‌రువు, ఎవ‌రు భారమో చెప్పాల‌ని ఇంటి స‌భ్యులని ఆదేశించారు నాగ్‌. భారం అయ్యేవాళ్ళు బ‌రువైన బిగ్ బాస్ బ్యాగ్ పైకి ఎత్తి ప‌ట్టుకొని ఎదుటి వాళ్ళు వీళ్ల గురించి చెప్పే వ‌ర‌కు అలానే ప‌ట్టుకోవాల‌ని అన్నారు. ముందుగా అలీ.. మ‌హేష్ పేరు చెప్పాడు. మ‌హేష్ బ్యాగ్ ని అలీ చెప్పే వ‌ర‌కు ఎత్తి ప‌ట్టుకొని ఉన్నాడు. ఆ త‌ర్వాత శివ‌జ్యోతి ట్యాంక్‌లో నీళ్ళు పోయ‌డం, వైల్డ్ కార్డ్ ద్వారా వ‌చ్చి అమ్మ‌ల‌క్క‌ల ముచ్చ‌ట్లు పెట్ట‌డం గురించి అలీపై సీరియ‌స్ అయ్యాడు. మాకు పాత అలీ కావాల‌ని చెప్పారు నాగార్జున‌.

ఇక వితికా వంతు రాగానే ఆమె శివ‌జ్యోతి ఇంటికి భార‌మ‌ని చెప్పింది. శివ‌జ్యోతి.. వితికా భార‌మ‌ని చెప్పింది. శ్రీముఖి..రాహుల్ పేరు చెప్ప‌గా, బాబా భాస్క‌ర్.. రాహుల్ ఇంటికి భారం అని అన్నారు. వ‌రుణ్ సందేశ్.. మ‌హేష్ పేరు చెప్పగా, మ‌హేష్‌.. రాహుల్ అని అన్నాడు. పునర్న‌వి, రాహుల్‌లు కూడా.. మ‌హేష్ పేరు చెప్ప‌డంతో ఎక్కువ ఓట్లు మ‌హేష్‌కి ప‌డ్డాయి. దీంతో మ‌హేష్ ఈ ఇంటికి భారం అని హౌజ్‌మేట్స్ క‌న్‌ఫాం చేశారు.

మ‌రో నాలుగు వారాల‌లో బిగ్ బాస్ సీజ‌న్ 3కి ఎండ్ కార్డ్ ప‌డ‌నుండ‌గా, ఈ సీజ‌న్ ఇంటికి చివ‌రి కెప్టెన్‌గా శ్రీముఖి నిలిచింది. బ్యాటిల్ ఆఫ్‌ది మెడాలియ‌న్ టాస్క్‌లో వితికా విజేత‌గా నిల‌వ‌డంతో శ్రీముఖి వితికా మెడ‌లో మెడ‌ల్ వేసింది. బాబా భాస్క‌ర్ స‌ర్టిఫికెట్ అందించారు. మెడాలియ‌న్ టాస్క్‌లో విజేత‌గా నిలిచిన కార‌ణంగా వితికాకి ఇమ్యునిటి ల‌భించింది. ఈ ఇమ్యునిటితో నాలుగు వారాల‌లో ఎప్పుడైన ఒక‌సారి నామినేషన్ నుండి సేవ్ కావ‌చ్చు. ఇక నామినేష‌న్‌లో ఉన్న రాహుల్‌, మ‌హేష్‌, పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్‌ల‌లో రాహుల్ సేవ్ అయ్యాడు. మిగ‌తా ముగ్గురిలో ఒక‌రు రేపు ఎలిమినేట్ కానున్నారు.

7143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles