బాలీవుడ్ మూవీలో నాగ్‌.. నేటి నుండి షూటింగ్ మొద‌లు

Wed,July 11, 2018 12:29 PM
nagarjuna joins the set of brahmastra

ద‌క్షిణాదిలో స్టార్ స్టేట‌స్ సాధించిన నాగార్జున నార్త్‌లోను ప‌లు చిత్రాల‌లో న‌టించాడు. ‘ఖుదా గవా’ చిత్రంతో పాటు ‘జఖమ్‌’, ‘అగ్ని వర్ష’, ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ చిత్రాల్లో అమితాబ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి అమితాబ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అయాన్ ముఖ‌ర్జీ బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. బాహుబ‌లి రేంజ్‌లో చిత్రం తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో ముఖ్య పాత్ర కోసం నాగార్జున‌ని సంప్ర‌దించార‌ట‌. ఆ పాత్ర త‌న‌కెంతో న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాడు. బ‌ల్గేరియాలో జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో నాగ్ కూడా పాల్గొన‌నున్నాడు. జూలై 19 వ‌ర‌కు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. నాగ్ ప్ర‌స్తుతం దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్‌తో పాటు ఓ మ‌ల‌యాళ చిత్రంతో బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. 2003లో ‘ఎల్‌.ఓ.సి.కార్గిల్‌’ అనే హిందీ చిత్రంలో న‌టించిన నాగార్జున ప‌దిహేనేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు.

1673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS