బ్రహ్మాస్త్ర సెట్స్‌లో నాగార్జున..ఫొటోలు వైరల్

Fri,July 20, 2018 06:38 PM
Nagarjuna joined brahmastra movie sets in bulgaria

బల్గేరియా : టాలీవుడ్ యాక్టర్ నాగార్జున హిందీ ప్రాజెక్టు ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బల్గేరియాలో ఉన్న నాగార్జున తన టీంతో కలిసి సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. బ్రహ్మాస్త్ర తారాగణం రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, మౌనీరాయ్‌తో నాగ్ సెట్స్‌లో ఉన్న ఫొటోలను దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..చాలా విరామం తర్వాత హిందీ సినిమా చేస్తున్నా. గతంలో నేను హిందీ చిత్రం ఎప్పుడు చేశానో గుర్తు లేదు. అమితాబ్ జీ కాకుండా బ్రహ్మాస్త్రలో నటిస్తున్నవారంతా నాకు కొత్త. నేను తొలిసారి కరణ్‌జోహార్, అయాన్ ముఖర్జీ, అలియాభట్, రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పాడు.

4653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS