బిగ్ బాస్ 3 హోస్ట్ మ‌రెవ‌రో కాదు..!

Thu,May 16, 2019 08:35 AM
Nagarjuna host bigg boss3

రెండు సీజ‌న్స్‌లోను బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడ‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆ త‌ర్వాత నాగార్జున‌, అనుష్క అంటూ ప‌లువురు పేర్లు ఫ్రేంలోకి వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఆయ‌న‌నే నిర్వాహ‌కులు ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌. మ‌రో వైపు బిగ్ బాస్ 3లో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా జ‌రుగుతుంది. జూలైలో ఈ షో ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. కాగా, నాగార్జున ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

4145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles