ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ త‌న‌ది కాద‌న్న నాగార్జున‌

Sat,June 15, 2019 11:43 AM
nagarjuna condense the rumors of his account

ప్ర‌స్తుతం సెలబ్రిటీలు అంద‌రు దాదాపు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారానే అభిమానుల‌తో ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉంటున్నారు. సినిమా విష‌యాల‌నే కాదు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో నెటిజ‌న్స్ త‌మ అభిమాన హీరోల‌ని ఫాలో అవుతూ వ‌స్తున్నారు. అయితే కొన్ని సార్లు సెల‌బ్రిటీల పేరుతో త‌ప్పుడు ఎకౌంట్స్ క్రియేట్ చేసి నెటిజ‌న్స్‌ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు కొంద‌రు. దీనిపై ఒక్కోసారి స్టార్స్ స్వ‌యంగా స్పందించి అది ఫేక్ ఎకౌంట్ అని వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌ల‌సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంది. తాజాగా అక్కినేని నాగార్జున కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ త‌న‌ది కాద‌ని క్లారిటీ ఇచ్చాడు. నాగార్జున పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో అన్ని నాగ్‌కి సంబంధించిన ఫోటోలు ఉండ‌డంతో పాటు దానికి 10.3 కే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. దీంతో అంద‌రు అది నాగ్ ప‌ర్స‌న‌ల్ ఎకౌంటే అని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాగ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఆ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ నాది కాదు. ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు ఆ స‌మాచారాన్ని త‌ప్ప‌క మీకు అందిస్తాన‌ని పేర్కొన్నాడు. నాగ్ ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు 2 చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది.


1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles