అఖిల్ అందుకోనున్న కాస్ట్‌లీ గిఫ్ట్ ఎంటో తెలుసా.!

Wed,December 20, 2017 01:14 PM
nagarjuna car gift to akhil

అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ త‌న తొలి చిత్రం అఖిల్ అనే టైటిల్ తో వెండితెర ఆరంగేట్రం చేశాడు. ఈ మూవీ డిజాస్ట‌ర్ అయింది. దీంతో రెండో సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. ఖ‌చ్చితంగా ఈ సినిమా స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో మ‌నం లాంటి అద్భుత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో హ‌లో అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తుంటే హ‌లో చిత్రం అభిమానుల అంచనాల‌ని అందుకునేలా క‌నిపిస్తుంది. ఇక ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అన్న‌పూర్ణ స్డూడియో బేన‌ర్‌పై నాగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాలో న‌టించినందుకు అంద‌రు రెమ్యున‌రేష‌న్ పొంద‌గా, అఖిల్ ఒక్క పైసా కూడా తీసుకోలేదట‌. అందుకే త‌న త‌న‌యుడి కోసం నాగ్ 2 కోట్ల విలువైన కారు ని గిఫ్ట్ గా ఇచ్చేందుకు రెడీ చేశాడ‌ట‌. సినిమాపై నాగ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు కాబ‌ట్టి, రిలీజ్ త‌ర్వాత ఈ గిఫ్ట్ ఇస్తాడ‌ని తెలుస్తుంది.

1788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles