నాని- నాగ్‌ మల్టీస్టారర్‌కి లైన్ క్లియర్ అయినట్టేనా?

Thu,September 14, 2017 12:46 PM
Nagarjuna and Nani team up for multi-starrer project

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్ళ త‌ర్వాత వెంకీ మొద‌లు పెట్టిన ఈ మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు అంద‌రిలో నూత‌న ఉత్తేజాన్ని క‌లిగించింది . దీంతో చాలా మల్టీ స్టారర్ మూవీస్ ప‌ట్టాలెక్కుతున్నాయి. టాలీవుడ్ మన్మధుడు నాగ్ ఒక వైపు సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు వైవిధ్యమైన కథాంశాలతో వెరైటీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నాగ్ నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. భ‌లే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని, నాగ్ లు మల్టీస్టారర్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది . స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్. నవంబర్ లో లేదా డిసెంబర్ లో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో నాని గెటప్ వైవిధ్యంగా ఉండగా, నాగ్ పాత్రని మాత్రం సీక్రెట్ గా ఉంచుతున్నారు.

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles