యంగ్ హీరోతో సుకుమార్ సినిమా ..!

Sat,December 8, 2018 10:47 AM
Naga Shourya Teams Up With Sukumar

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సుకుమార్ త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి ఓ పీరియాడిక‌ల్ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సుకుమార్ ద‌ర్శ‌కుడిగానే కాకుండా నిర్మాత‌గాను అద్భుత చిత్రాల‌ని రూపొందిస్తుండ‌గా, యంగ్ హీరో నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో త‌న బేన‌ర్‌పై ఓ మూవీని నిర్మించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, సుక్కూ అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌లో ఓ వ్య‌క్తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తుంది. ఛ‌లో మూవీ త‌ర్వాత నాగ శౌర్య‌కి స‌రైన స‌క్సెస్ లు ప‌ల‌క‌రించ‌క‌పోగా, సుకుమార్ ప్రాజెక్ట్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు తెలుస్తుంది.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles