నాగ‌శౌర్య‌ని డైరెక్ట్ చేయ‌నున్న డెబ్యూ డైరెక్ట‌ర్

Thu,September 19, 2019 12:57 PM

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కుర్ర హీరో నాగ‌శౌర్య‌. ఇటీవల ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించినప్ప‌టికీ, ఫుల్ క్రెడిట్స్ స‌మంత‌కే ద‌క్కాయి. తాజాగా నాగ‌శౌర్య ప్రాజెక్ట్ సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై నాగ శౌర్య హీరోగా ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రాన్నిడెబ్యూ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య తెర‌కెక్కించ‌నున్నారు. అక్టోబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల కానుంది. చిత్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వర‌లో వెల్ల‌డించ‌నున్నారు

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles