మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న చై-సామ్ జంట‌!

Sun,April 14, 2019 07:17 AM

ఏ మాయ చేశావే చిత్రంలో తొలిసారి క‌లిసి న‌టించిన నాగ చైత‌న్య, స‌మంత ఆ త‌ర్వాత ఆటో న‌గ‌ర్ సూర్య‌, మ‌నం, మ‌జిలీ చిత్రాల‌లో న‌టించారు. ఈ చిత్రాల‌న్నింటిలో వారిద్ద‌రి కెమిస్ట్రీ బాగా వ‌ర్కౌట్ అయింది. ప్రేక్ష‌కులు వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌ని ఎంత‌గానో ఆద‌రించారు. తాజాగా వ‌చ్చిన మ‌జిలీ చిత్రంలో చైతూ- స‌మంత న‌టించ‌గా, ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 50 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. రానున్న రోజులలో మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం నాగ‌చైత‌న్య-సమంత మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీరిద్ద‌రికి సంబంధించి ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్ ప్రిపేర్ చేయ‌గా, అది వీరికి ఎంతో న‌చ్చ‌డంతో మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌లిసి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. ఈ ఏడాదే ఆ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ట‌.

1879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles