డిజాస్ట‌ర్‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌..!

Wed,September 13, 2017 05:50 PM
డిజాస్ట‌ర్‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌..!

సినిమా హీరోలు ఎక్కువగా ఇమేజ్ గురించి ఆలోచిస్తారు. ఫలానా సినిమా చేస్తే తన ఇమేజ్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఆ మూవీ ఎఫెక్ట్ తన కెరీర్ పై ఎలా ఉంటుంది? అని బాగా ఆలోచించి స్టెప్ తీసుకుంటారు. ఒక్కోసారి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ ఫలితం బాగ లేకపోతే తమ పద్ధతి మార్చుకుంటున్నారు. నాగచైతన్య కూడా ఇప్పుడు అదే రూట్ లో ఉన్నాడు. కెరీర్ పరంగా ఓ డెసిషన్ తీసుకున్నాడు.

చైతూ తాజా చిత్రం యుద్ధం శ‌ర‌ణం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అభిమానుల అంచ‌నాలను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో చైతూ ఇప్ప‌డు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఇప్ప‌ట్లో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేయాల‌ని భావించడం లేద‌ని టాక్. 'యుద్ధం శరణం' సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి నాగచైతన్య మూవీ స్టార్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని యుద్ధం శ‌ర‌ణం రిజ‌ల్ట్‌తో ముందుగా మారుతి సినిమా చేయాలనీ, ఆ తరువాతనే చందూ మొండేటితో 'సవ్యసాచి' చేయాలని చైతూ భావిస్తున్నాడని టాక్. సవ్యసాచి సినిమా యాక్షన్ మూవీగా రూపొంద‌నుండ‌గా, మారుతి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

3104

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS