పెళ్ళి త‌ర్వాత తొలిసారి..

Sat,March 17, 2018 10:45 AM
Naga Chaitanya Samantha Project goes on floors

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత నిన్న‌టి వ‌ర‌కు ఎవ‌రి ప్రాజెక్టుల‌తో వారు బిజీగా ఉన్నారు. చైతూ.. స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి చిత్రాల‌తో బిజీగా ఉంటే స‌మంత ఇటు తెలుగు అటు త‌మిళ ప్రాజెక్టుల‌తో తీరిక లేకుండా టైం గడుపుతుంది. పెళ్ళికి ముందు ఏం మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల‌లో క‌లిసి న‌టించిన స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి శివ నిర్వాణ ప్రాజెక్ట్‌లో హీరో హీరోయిన్‌లుగా న‌టించ‌నున్నారు. చిత్రానికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా ఈ రోజు నుండి మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది . ఇక‌ చైతూ, స‌మంత నేటి నుండే టీంతో జాయిన్ అవుతున్నారు. ఈ సంద‌ర్బంగా ల‌వ‌ర్ బోయ్ చైతూ త‌న ట్విట్ట‌ర్‌లో ఫోటోని షేర్ చేస్తూ.. ఇది ఖ‌చ్చితంగా కొత్త రోజే.. నా శ్రీమ‌తితో షూటింగ్‌కి వెళుతున్నాను. మీకు మ‌రింత ఆనందాన్ని అందించ‌నున్నాము అని ట్వీట్ చేశారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.3075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles