అఖిల్‌తో పార్టీ జ‌రుపుకున్న చై-సామ్ జంట‌

Wed,September 26, 2018 09:45 AM
naga chaitanya samantha enjoyed in the pub

టాలీవుడ్ క్రేజీ క‌పుల్ నాగ చైత‌న్య‌- స‌మంత ప్ర‌స్తుతం పార్టీ మూడ్‌లోకి వెళ్ళారు. స‌మంత న‌టించిన యూట‌ర్న్‌, చైతూ న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాలు ఒకే రోజు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. రెండు చిత్రాలు వేరే జాన‌ర్స్ కావ‌డంతో ఆ రెండింటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. షూటింగ్స్‌, ప్ర‌మోష‌న్స్ అంటూ మొన్న‌టి వ‌ర‌కు బిజీగా ఉన్న చైతూ-సామ్‌లు ప‌బ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వీరితో పాటు అఖిల్ కూడా ఉన్నాడు. ఇటీవ‌ల మ‌జ్ఞు షెడ్యూల్ పూర్తి చేసుకున్న అఖిల్ మ‌రో షెడ్యూల్‌కి సిద్ధ‌మ‌య్యాడు. వీరి ముగ్గురు ప‌బ్‌లో చేస్తున్న సంద‌డికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. షూటింగ్‌ల‌కి షార్ట్ బ్రేక్ తీసుకున్న చై- సామ్ జంట త్వ‌ర‌లో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న టీంతో క‌ల‌వ‌నుంది. ఈ చిత్రం మంచి ప్రేమ క‌థా చిత్రంగా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఈ ఏడాది వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత‌కి ఈ చిత్రం కూడా మ‌రో విజ‌యాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు.

View this post on Instagram

Inner peace 😎

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

2800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles