మ‌జిలీలో రెండు గెట‌ప్స్‌లో కనిపించ‌నున్న చైతూ

Sat,January 12, 2019 11:45 AM
naga chaitanya appears two different looks in majili

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత పెళ్ళి త‌ర్వాత తొలిసారి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం మ‌జిలి. ఈ చిత్రంలో చైతూ, స‌మంత‌లు భార్య, భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది . ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ నాలుగో చిత్రం మ‌జిలి. చైతూ మాజీ క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే చిత్రంలో చైతూ సమంతతో పెళ్లికి ముందు ఒక గెటప్ లో.. అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో మ‌జిలి సినిమా ఉండబోతోందట. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles