మామ అల్లుళ్ల‌ మ‌ల్టీ స్టార‌ర్ సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడో తెలుసా ?

Fri,November 30, 2018 01:42 PM
Naga Chaitanya And Venkatesh Multi Starrer To Go On Floors in december

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. మూడు నాలుగు మ‌ల్టీ స్టార‌ర్స్ సెట్స్ పై ఉండ‌గా, మ‌రో క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. వెంక‌టేష్‌, నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న చిత్రం ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా డిసెంబ‌ర్ 12 నుండి సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. తొలి షెడ్యూల్‌ని చెన్నైలో మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్‌కి వెంకీ మామ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాయి. ప్ర‌స్తుతం వెంకీ .. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. మ‌రో వైపు చైతూ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌జిలి అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

2695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles