చైతూ, స‌మంత ఫన్నీగేమ్‌- వీడియో

Wed,April 3, 2019 01:36 PM
Naga Chaitanya and Samantha funny video

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం మ‌జిలి. నిన్నుకోరి ఫేం శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో దివ్యాంష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. తాజాగా చై, సామ్‌ ‘గెస్‌ ది వర్డ్‌’ అనే ఫన్నీ ఆట ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. గేమ్ రూల్స్ వ‌చ్చేసి హై సౌండ్‌తో ఉండే హెడ్ ఫోన్స్ పెట్టుకొని అవ‌తలి వార చెప్పే ప‌దాల‌ని గెస్ చేయాలి. ముందుగా స‌మంత హెడ్ ఫోన్స్ పెట్టుకొని గేమ్ ఆడింది. రెండింటికి మాత్ర‌మే సమాధానం చెప్ప‌లేక‌పోయిన సామ్ మిగ‌తావ‌న్నింటిని గెస్ చేసి క‌రెక్ట్ స‌మాధానం ఇచ్చింది. చైతూ కూడా కొన్ని గెస్ చేసి స‌రిగ్గా చెప్పారు. వీరిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దాగా సాగిన ఈ గేమ్ ఫ‌న్నీగా ఉంది. ఫ‌న్నీ వీడియోలో చైతూ, సామ్‌ల స‌ర‌దా సంభాష‌ణ‌లు అభిమానుల‌కి కూడా న‌వ్వు తెప్పిస్తున్నాయి. మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

1289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles