అర‌వింద స‌మేత‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించ‌నున్న మెగా బ్ర‌ద‌ర్

Thu,June 21, 2018 09:04 AM
naga babu plays main role in Aravindha Sametha

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అరవింద స‌మేత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం హైద‌రాబాద్ శివార్ల‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌ధ‌మార్ధంలో సిద్ధార్ధ్ గౌత‌మ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘ‌వగా క‌నిపించి అల‌రించనున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌డంతో పాటు ఇది పూర్తి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ కూడా ప్రద‌ర్శించ‌నున్నాడ‌ట‌. చిత్రంలో ల‌వ్ ట్రాక్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే ఇందులో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఆయ‌న పాత్ర చిత్రానికే మేజ‌ర్ హైలైట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్న నాగ‌బాబు పూర్తి రాయ‌ల‌సీమ స్లాంగ్‌లోనే మాట్లాడ‌న‌నున్నాడ‌ట‌. జ‌గ‌ప‌తి బాబు హీరోయిన్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ‌ని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles