HomeLATEST NEWSnaga babu gifted audi car to niharika

నాన్న ఇచ్చిన గిఫ్ట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన నిహారిక

Published: Wed,June 15, 2016 10:09 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మెగా ఫ్యామిలీ నుండి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీస్తున్న అందాల భామ నిహారిక. ఇటు బుల్లితెరపైన, అటు వెబ్‌ సిరీస్ ద్వారా అలరించిన ఈ మెగా భామ తాజాగా ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం జూన్‌ 24న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , ట్రైలర్స్ మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నాయి. నిహారిక మూవీ కోసం మెగా అభిమానులే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాగ బాబు సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కూతురి తొలి చిత్రం కోసం ఎప్పుడా ఎన్నడా అన్నట్టు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో తన కూతురికి ఓ ఆడీ కారును బహుమతిగా ఇచ్చి తన కూతురిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఈ మెగా బ్రదర్‌. ఇక ఆ సమయంలో తండ్రి నుండి గిఫ్ట్ అందుకుంటున్న నిహారిక మొహం సంతోషంతో వెలిగి పోయింది. ఇటీవల వరుణ్‌ తేజ్ తన తండ్రి కోసం ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

4326
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology