జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకోవ‌డంపై స్పందించిన నాగ‌బాబు

Fri,November 22, 2019 08:43 AM

గ‌త ఐదారు సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంతో హాస్యాన్ని పంచుతున్న పాపులర్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. నాగ‌బాబు, రోజా జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి అన‌సూయ‌, ర‌ష్మిలు యాంకర్స్‌గా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా నాగబాబుతో పాటు చ‌మ్మ‌క్ చంద్ర‌, అదిరే అభిలు జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం నుండి బ‌య‌ట‌కి వ‌చ్చార‌ని విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా స్పందించారు నాగ‌బాబు.


గురువారం, శుక్ర‌వారం నాకు చాలా ముఖ్యమైన రోజులు. 2013 ఫిబ్రవరి నుంచి 2019 నవంబర్ వరకు ‘జబర్దస్త్’లో నా ప్ర‌యాణం కొనసాగింది. ఇదొక హ్యాపీ, ఎమోషనల్ జర్నీ. నేను బ‌య‌ట‌కి రావ‌డంపై పుకార్లు ఎక్కువైనందున తాజాగా స్పందించాల్సి వ‌స్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ గురించి నేనెప్పుడు పాజిటివ్‌గానే మాట్లాడాను. నా హ్యాపీ జ‌ర్నీ ఇక ముగిసింది. శుక్ర‌వారం వ‌చ్చే ఎపిసోడ్‌లో ఇక నేను క‌నిపించ‌ను. నాకు నేనుగా జ‌బ‌ర్ధ‌స్త్ మానేస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. ఏదైనా ప్రోగ్రామ్ కానీ, ప్రయాణం కానీ ఎక్కడో ఒక చోట ఆగాలని.. అయితే, ప్రోగ్రామ్ ముగియముందే నా ప్రయాణం ముగించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కానీ, ఎవరి మీద నేరాలు వేయడం కానీ చేయనని స్పష్టం చేశారు.

రెమ్యునరేషన్ విష‌యంలోనే నేను బ‌య‌ట‌కి వ‌చ్చాన‌ని చాలా మంది ప్ర‌చారం చేశారు. నా స్థాయికి త‌గ్గ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క‌పోయిన నేను జ‌బ‌ర్ధ‌స్త్‌తో క‌లిసి చాలా రోజులు ప్ర‌యాణించాను. దాదాపు ఏడున్న‌ర సంవ‌త్స‌రాల పాటు నా ప్ర‌యాణం సాగింది. జబర్దస్త్ షోలోకి ప్రవేశించే సమయానికి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో ‘జబర్దస్త్’ తనకెంతో హెల్ప్ అయ్యిందని వెల్లడించారు నాగ‌బాబు . ఈ విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. అంతకు ముందు ‘అదుర్స్’ షోలో జడ్జిగా చేసిన తనను ‘జబర్దస్త్’లో కూడా చేయాలని శ్యామ్ కోరారని, తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నానని నాగబాబు చెప్పారు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నవ్వించే వాళ్ళ‌ని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను.

న‌వ్వించే ప్రోగ్రాం జ‌బ‌ర్ధ‌స్త్ కాబ‌ట్టి ఇన్ని రోజులు ఆ కార్య‌క్ర‌మంతో జ‌ర్నీ చేశాను.ఆ ప్రోగ్రాం చేస్తుంటే హాలీడే ట్రిప్‌కి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది. అయితే బిజినెస్ ఐడియాలజీలో వ‌చ్చిన విభేదాల కారణంగానే ‘జబర్దస్త్’ నుంచి బయటికి వచ్చేశానని, త‌ప్ప మ‌రొక‌టి లేదు. ఆ కారణాలేంటో ఒక్కొక్కటికీ తరవాత వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు నాగ‌బాబు .

2653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles