వ్యాపార భాగ‌స్వామిపై నాగ్ సోద‌రి కేసు

Sat,November 18, 2017 04:42 PM
nag suseela complaints on chintala

అక్కినేని నాగార్జున సోదరి, సుశాంత్ మ‌ద‌ర్ నాగ సుశీల త‌న వ్యాపార భాగ‌స్వామి చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌కు తెలియ‌కుండా శ్రీనివాస‌రావు కంపెనీ ఆస్తులు అమ్ముకున్నార‌ని నాగ సుశీల త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలుస్తుంది. ఏడాది కాలంగా వీరి మ‌ధ్య వివాదం జ‌రుగుతున్న‌ప్ప‌టికి , ఈ వివాదం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. 12 ఏళ్లుగా నాగ సుశీల‌, చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు వ్యాపార‌, సినీ నిర్మాణ భాగ‌స్వాములుగా ఉన్నారు. ఎస్ఎస్ ప్రెమిసెస్ పేరిట ఓ కంపెనీని ప్రారంభించి త‌న‌ని మోసం చేశాడని నాగ సుశీల ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస‌రావు .. నాగ సుశీల త‌న‌యుడు సుశాంత్‌తో క‌లిసి కాళిదాసు , ‘కరెంట్’.. ‘అడ్డా’.. ‘ఆటాడుకుందాం రా’ సినిమాల‌ను నిర్మించాడు. అయితే ఈ వివాదంపై చింత‌ల‌పూడి వ‌ర్షెన్ మ‌రోలా ఉంది. నాగ సుశీల త‌న‌పై కావాల‌నే కంప్ల‌యింట్ ఇచ్చార‌ని చెబుతున్నాడు శ్రీనివాస‌రావు. త‌న‌కి బాకీ ప‌డ్డ సొమ్ముని ఎగ్గొట్టడంతో పాటు, కంపెనీ ఆస్తుల‌ని త‌న సొంతం చేసుకునేందుకు ఈ డ్రామా ఆడుతున్నార‌ని ఆయ‌న అన్నాడు. దీనిపై ఇప్ప‌టికే సివిల్ కేసు న‌డుస్తుండ‌గా,ఈ కేసును క్రిమిన‌ల్ కేసుగా మార్చాల‌ని వారు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చింత‌ల‌పూడి చెబుతున్నాడు. మ‌రి రానున్న రోజుల‌లో ఈ వ్య‌వ‌హారం ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

1751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles