దాస్‌కి స‌పోర్ట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చిన దేవ

Sun,September 23, 2018 12:03 PM
nag on bigg boss stage

బిగ్ బాస్ సీజన్ 2 మొద‌లైన‌ప్ప‌టి నుండి చాలా సినిమాల‌కి సంబంధించిన యూనిట్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి వాళ్ళ సినిమాని ప్ర‌మోట్ చేసుకుంటూ ఇంటి స‌భ్యులతో స‌ర‌దా క్ష‌ణాలు గ‌డిపారు. తాజాగా దేవ‌దాస్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు నాగ్ బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చారు. మా దాస్‌ని ఎవ‌రో ఇబ్బంది పెడుతున్నార‌ట‌. గ‌న్‌లో క‌రెక్ట్‌గా ఆరు బుల్లెట్స్ ఉన్నాయ‌ని నాగ్ చెబుతున్న డైలాగ్స్‌తో ఈ రోజు ప్ర‌సార‌మయ్యే షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. అంటే ఈ రోజు బిగ్ బాస్ స్టేజీపై నానితో పాటు నాగ్ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నార‌న్న‌మాట‌.

నాని, నాగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన దేవదాస్ టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ ల‌లో ఒక‌టి కాగా ,ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది ఇటీవ‌ల విడుద‌లైన‌ టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. చిత్రం మొత్తం ఫుల్‌ కామెడీగా ఉంటుంద‌ని తెలుస్తుంది. దేవ పాత్ర‌లో నాగార్జున‌, దాస్ పాత్ర‌లో నానిలు సరికొత్త వినోదాన్ని అందించ‌నున్నారు . శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌ష్మిక మందాన్న‌, ఆకాంక్ష సింగ్‌లు కథానాయిక‌లుగా న‌టించారు. మ‌ణిశ‌ర్మ చిత్రానికి సంగీతం అందించారు.వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.5352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles