బిగ్ బాస్3 : వినోదాన్ని పంచుతూనే చుర‌క‌లు అంటించిన నాగ్

Sun,August 4, 2019 06:22 AM
nag entertain with housemates

గ్రీకు వీరుడు పాట‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ శుక్ర‌వారం ఎపిసోడ్‌ని మ‌న టీవీలో చూపించారు. ఆదివారం ఎలిమినేష‌న్ ఉండ‌డంతో గురువారం నుండే నామినేష‌న్‌లో ఉన్న స‌భ్యులు బ్యాగులు స‌ర్ధేశారు. ఇక కిచెన్‌లో త‌మ‌న్నాతో స్టెప్పులేయించిన బాబా భాస్క‌ర్ కెమెరాతో కాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇక వ‌రుణ్ సందేశ్‌, వితికా, పున‌ర్న‌వి, రాహుల్‌ ఎలిమినేష‌న్ గురించి చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో పునర్న‌వి .. రాహుల్‌ని కాలుతో త‌న్నుతుంది. ఇది గ‌మ‌నించిన నాగ్ ..పునర్న‌వి కాలుతో త‌న్న‌డం గ‌మ‌నించారా అని వీక్ష‌కుల‌ని అడుగుతారు. ఇక రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో పునర్న‌వి, త‌మ‌న్నా,శ్రీముఖి ఫుల్ ఎన‌ర్జీతో స్టెప్పులు వేశారు. బాబా భాస్క‌ర్, మ‌హేష్‌, జాఫ‌ర్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉండ‌గా, మ‌హేష్‌.. వ‌రుణ్ సందేశ్ ప్ర‌వ‌ర్త‌న గురించి వారితో చ‌ర్చించాడు.

మ‌న టీవీలో ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడిన నాగ్‌.. నాలుగ‌న్న‌ర కోట్ల తెలుగు ప్రేక్ష‌కులు మిమ‌ల్ని చూస్తున్నార‌ని చెప్పి ఇంటి స‌భ్యుల‌ని ఆనంద‌ప‌ర‌చాడు. ఆ త‌ర్వాత.. వారంలో జ‌రిగిన వివాదాలు, ప‌లు సంఘ‌ట‌న‌లు గురించి ప్ర‌స్తావించాడు. టాస్క్‌లో శివ‌జ్యోతి కింద‌ప‌డ‌డం చూసి చాలా బాధ‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చిన నాగ్.. రాష్ట్రంలో వ‌ర్షాలు బాగానే ప‌డుతున్నాయి, ప్ర‌తి దానికి ఏడ‌వాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత అలీ.. త‌మ‌న్నా గొడ‌వ‌లో అలీ ఓపిక‌ని నాగ్ ప్ర‌శంసించాడు. త‌మ‌న్నా అస‌భ్యప‌ద‌జాలంతో దూషించిన‌ప్ప‌టికి నీ ఓర్పుకి హ్యాట్సాఫ్ అన్నాడు. ఇక త‌మ‌న్నాని ఇంటి స‌భ్యుల‌తో మంచిగా ఉండ‌మ‌ని ఆదేశించాడు. అంద‌రితో స‌ర‌దాగా ఉండాలే త‌ప్ప వారికి శ‌త్రువులుగా మారొద్దని హిత‌వు ప‌లికాడు. వితికా, పున‌ర్నవి గొడ‌వ‌తో పాటు మ‌హేష్‌, వ‌రుణ్ సందేశ్‌ల మ‌ధ్య జ‌రిగిన వివాదాన్ని గురించి చ‌ర్చించారు నాగ్‌.

ఇక నామినేష‌న్‌లో ఉన్న 8 మంది స‌భ్యులు వ‌రుణ్ సందేశ్‌, వితికా, శ్రీముఖి, హిమ‌జ‌,జాఫ‌ర్‌, మ‌హేష్, పున‌ర్న‌వి, రాహుల్ సిప్లిగంజ్‌ల‌లో సేఫ్ అయిన తొలి కంటెస్టెంట్‌గా మ‌హేష్‌ని ఎంపిక చేశారు. క‌లిసొస్తే చెరుకు గ‌డ‌.. ఎదురొస్తే ర‌గ‌డ‌.. మ‌హేష్ సేఫ్ అని నాగ్ పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌కి హీరో విల‌న్ గేమ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో త‌మ‌కి న‌చ్చిన వారికి హీరో క్రోన్ పెట్టాల‌ని, న‌చ్చ‌ని వారికి విల‌న్ క్రోన్ పెట్టి అందుకు గ‌ల కార‌ణాలు కూడా వివ‌రించాల‌ని నాగ్ చెప్పారు. దాంతో ఇంటి స‌భ్యులు ఒక్కొక్క‌రు టాస్క్‌లో పాల్గొన్నారు. ముందుగా శివ జ్యోతి .. బాబా భాస్క‌ర్‌కి హీరో కిరీటం పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని వ‌రుణ్ సందేశ్‌కి పెట్టింది. ఇక అషూ హీరో కిరీటాన్ని బాబా భాస్క‌ర్‌కి .. విల‌న్ కిరీటాన్ని రాహుల్‌కి పెట్టారు. రోహిణి హీరో కిరీటాన్ని బాబా భాస్క‌ర్‌కి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని త‌మ‌న్నాకి పెట్టింది. హీరో కిరీటాన్ని బాబా భాస్క‌ర్‌కి ముగ్గురు సభ్యులు ఇవ్వ‌డంతో ఆయ‌న త‌ప్ప మ‌రో వ్య‌క్తికి హీరో కిరీటం పెట్టాల‌ని నాగ్ ఆదేశించారు.

త‌మ‌న్నా హీరో కిరీటాన్ని ర‌వికృష్ణకి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని అలీ రాజాకి పెట్టింది. ర‌వి కృష్ణ‌.. హీరో కిరీటాన్ని అలీకి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని త‌మ‌న్నాకి పెట్టాడు. జాఫ‌ర్ హీరో కిరీటాన్ని శ్రీముఖికి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని వ‌రుణ్ సందేశ్‌కి పెట్టాడు. ఆ త‌రువాత శ్రీముఖి హీరో కిరీటాన్ని జాఫ‌ర్‌కి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని వ‌రుణ్ సందేశ్‌కి పెట్టింది. రాహుల్ హీరో కిరీటాన్ని రోహిణికి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని శ్రీముఖికి పెట్టింది. హిమ‌జ హీరో కిరీటాన్ని అలీకి పెట్ట‌గా .. విల‌న్ కిరీటాన్ని త‌మ‌న్నాకి పెట్టింది. బాబా భాస్క‌ర్ హీరో కిరీటాన్ని రోహిణికి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని వితికాకి పెట్టాడు. పున‌ర్న‌వి హీరో కిరీటాన్ని త‌మ‌న్నాకి పెట్టగా, విల‌న్ కిరీటాన్ని మ‌హేష్‌కి పెట్టింది. వితికా హీరో కిరీటాన్ని వ‌రుణ్ సందేశ్‌కి పెట్టగా, విల‌న్ కిరీటాన్ని రాహుల్‌కి పెడుతుంది. వ‌రుణ్ సందేశ్ హీరో కిరీటాన్ని ర‌వి కృష్ణకి పెట్ట‌గా, విల‌న్ కిరీటాన్ని జ్యోతికి పెడ‌తారు. దీంతో ఈ టాస్క్ ముగుస్తుంది.

మొత్తానికి సర‌దాగా సాగిన ఈ టాస్క్ త‌ర్వాత నాగ్ .. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు శ్రీముఖి,హిమ‌జ‌ నామినేష‌న్ నుండి సేఫ్ అయిన‌ట్టు చెబుతాడు. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో వ‌రుణ్ సందేశ్, వితికా, పున‌ర్న‌వి ఉన్నారు. శనివారం బాబా భాస్క‌ర్ త‌న‌యుడి బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న‌కి విషెస్ చెప్పాల‌ని కోరాడు. దీంతో నాగ్‌తో పాటు మిగ‌తా ఇంటి స‌భ్యులు బాబా భాస్క‌ర్ త‌న‌యుడు అర్జున్ స‌తీష్‌కి విషెస్ అందించారు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంటి నుండి ఎవ‌రు బ‌య‌ట‌కి వెళ‌తారో చూడాలి.

2094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles