నంది వివాదంపై నాగార్జున కామెంట్‌

Thu,December 7, 2017 09:55 AM
nag comment on nandi award issue


ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 2014,2015,2016 సంవ‌త్స‌రాల‌కి గాను నంది అవార్డులు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత కొంద‌రికి నందులు రాక‌పోవ‌డంపై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు జ్యూరీపై మండి ప‌డ్డారు. అయితే న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఆఖ‌రు సినిమా మ‌నంకి నంది అవార్డు రాక‌పోవ‌డంపై చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌టుడు, నిర్మాత , నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు. కాని నిన్న జ‌రిగిన‌ హ‌లో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో నాగ్‌కి ఓ విలేకరి నుండి మ‌నం చిత్రానికి నంది అవార్డు రానందుకు బాధ‌గా ఉందా అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి నాగ్‌.. మ‌నం సినిమాకి ప్రేక్ష‌కులు త‌మ గుండెలిచ్చారు. వారి ఆద‌ర‌ణ మాకు ఆస్కార్ క‌న్నా ఎక్కువ అని చెప్పారు. దీంతో నాగ్ కూడా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై కాస్త అస‌హ‌నంగానే ఉంద‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడ‌ని అర్ధ‌మ‌వుతుంది.

5146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS