కోలీవుడ్‌లో ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న ఓటింగ్‌ .. గెలుపెవ‌రిదో ?

Sun,June 23, 2019 12:00 PM
Nadigar Sangam elections get intresting

న‌డిఘ‌ర్ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ ఈ రోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామిశంకరదాస్‌ జట్టు బరిలోకి దిగాయి. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారాల‌తో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగానే వీటిని హీటెక్కించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రుగుతుండ‌గా, సాయంత్రం 5 గంట‌ల వ‌రకు ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 3175 ఓట్లు ఉండ‌గా, ఓట‌ర్లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తార‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే మద్రాసు హై కోర్ట్ తీర్పు ప్రకారం పరిశ్రమకు చెందిన 61మంది వ్యక్తుల సభ్యత్వానికి సంబందించిన తీర్పు వెలువడే వరకు ఎన్నికలు ఫలితాలు ప్రకటించడానికి వీలులేదు. దీనితో ఎన్నికల ఫలితాల కోసం కొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

2278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles