ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్

Sun,June 23, 2019 05:47 PM
Nadigar Sangam Elections 2019

చెన్నై: చెన్నైలోని మైలాపూర్ సెయింట్ అబ్బాస్ బాలికల ఉన్నత పాఠశాలలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నడిగర్ సంఘంలో మొత్తం 3,100 మంది సభ్యులకు గాను 1587 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 2019 -2022 మధ్య కాలానికిగాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారాణ ఎన్నికలను తలదన్నేలాల జరిగిన తమిళ చిత్రపరిశ్రమ నడిగర్ సంఘంనకు గత ఎన్నికల్లో విజయం సాధించిన నాజర్ నేతృత్వంలోని పాండవర్ ప్యానల్‌కు, నటుడు దర్శకులు భాగ్యరాజ సారథ్యంలోని శంకర్‌దాస్ ప్యానల్ ఈసారి గట్టి పోటీని ఇచ్చింది. తమిళనాడుకు చెందిన సినిమా, టీవీ, నాటకరంగానికి చెందిన నటీనటులు, కళాకారులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలపై వివాదం నెలకొనడంతో మద్రాస్ హైకోర్టు తీర్పు తరువాతే ఫలితాలు వెల్లడికానున్నాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, 24 కార్యవర్గసభ్యుల కోసం ఎన్నిక జరిగింది. పాండవర్ ప్యానల్ నుంచి నాజర్, విశాల్, కార్తి పోటీపడ్డారు. శంకర్‌దాస్ ప్యానెల్ నుంచి భాగ్యరాజా ఉదయ, కుట్టిపద్మినీ పోటీపడుతున్నారు.

2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles